అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో రైతు భరోసాపై సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణ వర్షపాతం నమోదైందని, వర్షాలు లేకపోవడంతో సాగుపై ప్రభావం పడిందని అధికారులు సీఎం జగన్ కు వివరించారు. దీంతో సీఎం జగన్ రైతు భరోసా విషయంలో ఎక్కడా తగ్గొద్దని అధికారులకు సూచించారు. వ్యవసాయం, పౌరసరఫరాల శాఖ పై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆహార శుద్ధి రంగంలో ఏర్పాట్లు చేస్తున్న యూనిట్లను ఉపయోగించుకోవాలని అన్నారు. పీడీఎఉస్ ద్వారా మిల్లెట్లను ప్రజలకు పంపిణీ చేయాలని అన్నారు.
ఈ ఏడాది రెండో విడత రైతు భరోసాకు సిద్ధం కావాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. ఆర్బీకేల స్థాయిలో భూసార పరీక్షలు చేసే విధంగా అధికారులు అడుగులు ముందుకేయాలని చెప్పారు. చేయూత కింద మహిళల కోసం స్వయం ఉపాధి కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగించాలని అన్నారు.