CM Jagan: హైదరాబాద్, జనతా న్యూస్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అక్రమాస్తులపై మాజీ ఎంపీ హరిరామజోగయ్య హైకోర్టులో దాఖలు చేసిన పిల్ పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. దీనిపై సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్. వి శ్రావణ్ కుమార్ ధర్మాసనం విచారణ జరిపింది. దీనిని ప్రజా ప్రయోజనవ్యాజ్యంగా పరిగణించేందుకు అంగీకరించింది. హరిరామ జోగయ్య తరుపున న్యాయవాది పొలిశెట్టి రాధాకృష్ణ వాదనలు విన్న కోర్టు పిల్ కు నంబర కేటాయించాలని రిజస్ట్రీని ఆదేశించింది. ఈ పిల్ లో జగన్ అక్రమాస్తుల కేసును వేగవంతంగా విచారణ జరిపించాలని, 2024 ఎన్నికలలోపు తేల్చాలని కోరారు. దీంతో ఏపీ సీఎం జగన్ తో పాటు సీబీఐకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
CM Jagan: ఏపీ సీఎం జగన్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు..
- Advertisment -