Sunday, July 6, 2025

పొత్తులపై నేడు క్లారిటీ.. ఢిల్లీలో చంద్రబాబు చర్చలు..

విజయవాడ, జనతా న్యూస్: ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులు కుదిరినట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం, జనసేనలు కలిసి పోటీ చేస్తున్న విషయం ఇప్పటికే ప్రకటించాయి. అయితే తాజాగా బీజేపీ కూడా ఈ కూటమిలో చేరింది. ఇందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు సీట్ల విషయంపై ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో సమావేశం అవుతున్నారు.  శనివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చంద్రబాబు జరిపిన చర్చల్లో  సీట్ల పంపకంపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆంద్రధప్రదేశ్ లోని 30 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మిగతా స్థానాల్లో టీడీపీ బరిలో నిలిచే అవకాశం ఉంది. అయితే లోక్ సభ స్తానాల్లో బీజేపీ 6, జనసేన 2 కోరుటున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనపై చర్చలు కొనసాగుతున్నాయి. శనివారం సాయంత్ర అధికారికంగా వీటి గురించి ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page