ఓ కేక్ విషపూరితం కావడంతో పదేళ్ల చిన్నారి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బేకరి యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన మార్చి 24వ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పంజాబ్ లోని పటియాలకు చెందిన 10 ఏళ్ల చిన్నారి మాన్వికి ఈనెల 24న పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. సాయంత్రం 7 గంటలకు కేక్ కట్ చేసి కుటుంబ సభ్యులు అంతా తిన్నారు. అందరూ నిద్రలోకి జారుకున్న తరువాత మాన్వి నీరు తాగి నిద్రలోకి జారింది. ఉదయం ఆమె ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు హూటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఎంత ప్రయత్నించిన చిన్నారి ప్రాణాలు కాపాడేలేకపోయారు. కేక్ విషపూరిత కావడంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
బర్త్ డే కేక్ తిని చిన్నారి మృతి
- Advertisment -