Chickent Rates : హైదరాబాద్, జనత న్యూస్: వేసవి సమీపిస్తుండడంతో చికెన్ రేట్లు భగ్గుమంటున్నాయి. కోళ్లకు డిమాండ్ తగ్గి సప్లయ్ లేకపోవడంతో ఒక్కసారిగా రూ.300కు పెరిగింది. మొన్నటి వరకు రూ.200 లోపే ఉన్న చికెన్ ధర ఒక్కసారిగా రూ.100 పెరిగింది. దీంతో వ్యాపారుల్లో హర్షం వ్యక్తమవుతుండగా.. కొనుగోలుదారుల్లో మాత్రం ఆందోళన మొదలైంది. ఆదివారం చికెన్ ను రూ.280 నుంచి రూ.300 పెరిగింది. ఈ వారంలో రూ.350 పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే మార్చి రెండో వారం నుంచి ఎండలు తీవ్రం కానున్నాయి. ఈ నేపథ్యంలో కోళ్ల సరఫరాలో ఇబ్బందులు ఏర్పడనున్నాయి. ఇప్పటి వరకు కోళ్ల ఫారల్లో పిల్లలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇవి మార్కెట్లోకి రావడానికి సమయం పట్టనుంది. అయితే ఎండలు తీవ్రమైతే వీటిని కాపాడుకోవడం కష్టతరమవుతుందని కొందరు పాల్ట్రీ రైతులు అంటున్నారు. ఈ తరుణంలో చికెన్ రేట్లు కొన్ని రోజుల వరకు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
Chicken Rates : భగ్గుమన్న చికెన్ ధరలు
- Advertisment -