విజయవాడ, జనతా న్యూస్: ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ) షెడ్యూల్ ను మార్చాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రభుత్వానికి తెలిపింది. టెట్ పరీక్ష చివరి తేదీ నుంచి డీఎస్సి పరీక్ష ప్రారంభానికి మధ్యలో కనీసం నాలుగు వారాల సమయం ఇవ్వాలని తెల్చి చెప్పింది. ప్రాథమిక కీ తర్వాత అభ్యంతరాలు స్వీకరణకు వారం గడువు ఉండాలని ఈ మేరకు షెడ్యూల్ మార్చాలన్నారు. పేపర్ 1 ఎస్ జి టి అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ప్రస్తుతం ఇచ్చిన ఉత్తర్వులు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియలోని వర్తిస్తాయని స్పష్టత ఇచ్చింది. టెట్ నోటిఫికేషన్ ను ఈ ఏడాది ఫిబ్రవరి 8న జారీ చేశారని 27 నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు గుర్తు చేసింది. డీఎస్సీ నోటిఫికేషన్ ఫిబ్రవరి 12న జారీ చేసి మార్చి 15 పరీక్షలు నిర్వహించబోతున్నారని తెలిపింది. డిఎస్సీల పరీక్షల విషయంలో ప్రాథమిక కీ దగ్గర నుంచి అభ్యంతరాల స్వీకరణ వాటి పరిష్కారం తలనంతరం జారీ చేసే ప్రక్రియకు తక్కువ సమయం ఇచ్చారని న్యాయస్థానం తెలిపింది.
డీఎస్ సీ షెడ్యూల్ ను మార్చండి.. హైకోర్టు ఆదేశం
- Advertisment -