హైదరాబాద్, జనతా న్యూస్: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తుది జాబితాను విడుదల చేసింది. ఇప్పటి వరకు 5 జాబితాలను విడుదల చేసిన బీజేపీ శుక్రవారం ఫైనల్ అభ్యర్థులను ప్రకటించింది. శుక్రవారం నామినేషన్లు చివరి రోజు కావడంతో వీరు హూటాహూటిన నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లారు. ఇప్పటి వరకు ప్రకటించిన కొందరి అభ్యర్థులను మార్పు చేసింది. చంద్రాయణ గుట్ట, బెల్లంపల్లి, వనపర్తి అభ్యర్థుల స్థానంలో కొత్తవారిని కేటాయించారు.
పెద్దపల్లి -దుగ్యాల ప్రదీప్ కుమార్
శేర్ లింగంపల్లి -రవి కుమార్ యాదవ్
కంటోన్మెంట్ -గణేశ్ నారాయణ్
మల్కాజిగిరి -రామచంద్రరావు
సంగారెడ్డి – దేశ్పాండే రాజేశ్వర్ రావు
నాంపల్లి -రాహుల్ చంద్ర
మేడ్చల్ – ఏనుగు సుదర్శన్ రెడ్డి
వనపర్తి -సతీష్ అనుజ్ఓరెడ్డి
ఛాంద్రాయణ గుట్ట -కె. మహేందర్
దేవరకద్ర -ప్రశాంత్ రెడ్డి
అలంపూర్ -మేరమ్మ
నర్సంపేట -పుల్లారావు
మధిర -విజయరాజు
బెల్లంపల్లి -కొయ్యాల ఏమాజీ