దుర్గామాత మండపంలో పూజలు టిడిపి నాయకులు
హుజూరాబాద్ , జనతా న్యూస్: చంద్రబాబు నాయుడు త్వరగా కోలుకోవాలని తెలుగుదేశం పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ అయిత హరీష్ ఆధ్వర్యంలో హుజురాబాద్ లోని విద్యానగర్ లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి , తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక పథకం ప్రకారం కుట్ర పూర్వకంగా కేసులో పెట్టించిన విషయం తెలుగు ప్రజలందరికీ అర్థమైందన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రాలో జగన్ మోహన్ రెడ్డిని తెలంగాణలో కేసీఆర్ ను ఓడించడానికి తెలుగు ప్రజలందరూ సిద్ధమయ్యారని వారన్నారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని ఇట్లాంటి కుట్రలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలన్నారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వర్దినేని లింగారావు, హుజురాబాద్ పట్టణ అధ్యక్షుడు రామగిరి అంకుస్, మాజీ పట్టణ అధ్యక్షులు ప్రతాప రాజు, సీనియర్ నాయకులు పల్లె మల్లారెడ్డి, కామిని రాజేశం, చెడమాకి బిక్షపతి, ఆడెపు రవీందర్, అంబాల శంకర్, గుజ్జేటి నరేష్, మల్లారెడ్డి జూపాక, తదితరులు పాల్గొన్నారు.