విజయవాడ, జనతా న్యూస్ : స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు 4 వారాలపాటు మధ్యంతర బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ బెయిల్ సందర్భంగా చంద్రబాబుకు ఏపీ హైకోర్టు కొన్ని షరతులను విధించింది. రాజకీయా ర్యాలీలు చేయొద్దని, ఆసుపత్రికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు రిపోర్టు చేయాలని తెలిపింది. ఈ సందర్భంగా చంద్రబాబు వద్ద ఇద్దరు డీఎస్పీలను నియమించాలి అన్న పిటిషన్ ను సీఐడీ హైకోర్టులో వేసింది. ఈ పిటిషన్ పై శుక్రవారం విచారణ చేసి తిరస్కరించింది. ఈ పిటిషన్ ను ఇదివరకే వేయగా బుధవారం వాదనలు జరిగాయి. శుక్రవారం తీర్పును వెలువరించింది.
చంద్రబాబు మధ్యంతర బెయిల్.. సీఐడీ పిటిషన్ తిరస్కరణ
- Advertisment -