Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పై శుక్రవారం హైకోర్టు లో విచారణ సాగనుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయంలో చంద్రబాబు నాయుడు మద్యంతర బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై దసరా సెలవుల ప్రత్యేక బెంచ్ శుక్రవారం విచారణ జరపనుంది. ఈ బెయిల్ పిటిషన్ విచారణ జాబితాలో 8వ కేసుగా ఉంది. అంతకుముందు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ వేయగా నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రచయించారు. ఈ నెల 19న హైకోర్టు విచారణ జరిపి వేకెషన్ బెంచ్ కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో 27న విచారణకు కోర్టు ముందు ఉంచాలని రాజహేంద్రవరం జైలు అధికారులను ఆదేశించారు.
Chandrababu : చంద్రబాబు బెయిల్ పై నేడు విచారణ
- Advertisment -