ఇల్లంతకుంట, జనతా న్యూస్: మానకొండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ గెలుపు పట్ల ఇల్లంతకుంట మండలంలోని కాంగ్రెస్ నాయకుల్లో మండల ప్రజల్లో ఆనంద ఉత్సవాలు వెల్లువెరుస్తున్నాయి. కవ్వంపల్లి సత్యనారాయణ రెండుసార్లు ఇదే నియోజకవర్గము నుండి ఓడిపోయి మూడవసారి పోటీలో ఉండి హ్యాట్రిక్ ఓటమిని తప్పించుకొని కవంపల్లి విజయం సాధించగా బి.ఆర్.ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ ఇదే నియోజకవర్గం నుండి రెండుసార్లు గెలిచి మూడవసారి పోటీలో ఉండి హ్యాట్రిక్ విజయాన్ని సాధించలేక ఓడిపోవడం పట్ల మండల ప్రజల్లో హాట్ టాపిక్ గా మారింది. బి ఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ పై కాంగ్రెస్ అభ్యర్థి సత్యనారాయణ 32365 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మానకొండూరు నియోజకవర్గంలో 180236 ఓట్లు పోలై 81%గా నమోదు కాగా అందులో ఇల్లంతకుంట మండలంలో 30935 ఓట్లు పోలై 78 శాతంగా పోలింగ్ నమోదయింది గెలిచిన తమ నాయకున్ని కౌంటింగ్ అనంతరం పుష్పగుచ్చాలతో శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఇల్లంతకుంట మండలంలో ఆయన గెలుపుకు ఎంపీపీ రమణారెడ్డి అన్నీ తానై అహర్నిశలు పాటుపడ్డాడని ఆయనతోపాటు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాఘవరెడ్డి మాజీ ఎంపీపీ గుడిసె ఐలయ్య యాదవ్ లు కృషి చేశారని మండల ప్రజలు భావిస్తున్నారు మాజీ ఎంపీటీసీలు సర్పంచులు తోపాటు నాయకులు చిట్టి ఆనందరెడ్డి అనంతగిరి వినయ్ పశువుల వెంకటి కేశవరెడ్డి ఆకుల సత్యం గుండ వెంకటేశం బత్తిని మల్లయ్య బత్తిని నారాయణ గొడుగు నరసయ్య శంకర్ ఉప్పల అమరేందర్ మామిడి రాజు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి లతోపాటు ఆయా గ్రామ యువకులు కార్యకర్తలు టిడిపి వర్గీయులు ఆయన గెలుపుకు కృషి చేశారు తనకు ఓట్లు వేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అన్నివేళలా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని తనను కలిసిన ఇల్లంతకుంట మండల నాయకులతో ముచ్చటించారు
‘కవ్వంపెల్లి’ గెలుపుపై ఇల్లంతకుంటలో సంబరాలు
- Advertisment -