హైదరాబాద్, జనతా న్యూస్: తెలుగుచిత్ర పరిశ్రమ 90 ఏళ్ల వేడుకలు జూలై నెలలో నిర్వహించనున్నట్లు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. ఈ వేడుకలపై సినీ పెద్దలతో చర్చించి తేదీలను నిర్ణయిస్తామన్నారు. శనివారం మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సినిమాకు 90 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మూడు రోజులు షూటింగ్ లకు సెలవులు ఇవ్వాలని కోరామని, దీనికి ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు సానుకూలంగా స్పందించారని అన్నారు. దేశంలోని ఐదు అసోసియేషన్లతో ‘మా’ ఒప్పందం చేసుకుందని, తెలుగు సినిమా కీర్తిని చాటేందుకు వేడుకలను నిర్వహిస్తామని మంచు విష్ణు అన్నారు.
జూలైలో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుకలు :మంచు విష్ణు
- Advertisment -