జనతా న్యూస్ బెజ్జంకి : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో అత్యధిక స్థానాలను సాధించి అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ ఉత్కంఠానికి తెరదించి తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డి ని ప్రకటించడంతో బేగంపేట కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున టపాసులు కాల్చి సీట్ల పంపిణీ చేసిసంబరాలు జరుపుకున్నారు. తెలంగాణకు సమర్థవంతమైన డేరింగ్ డాషింగ్ డైనమిక్ లీడర్ ని సీఎంగా ప్రకటించడంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బేగంపేట గ్రామ శాఖ అధ్యక్షుడు గుండ అమరేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జనగం శంకర్, యువజన కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు గండికోట సురేష్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల ఉపాధ్యక్షుడు బర్ల శంకర్, సీనియర్ నాయకులు సోమరాంరెడ్డి, మాజీ ఎంపీటీసీ మామిడాల జయరాం, కొరివి లక్ష్మణ్, కొరివి కనకయ్య, గొడుగు నారాయణ, నూనె రాజేందర్, కాంగ్రెస్ యువ నాయకులు శీలం నర్సయ్య, గల్ఫ్ సేవా సమితి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బుర్ర తిరుపతి గౌడ్, మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు కొరి సంపత్, మాజీ కాంగ్రెస్ యువజన నాయకుడు వెన్నం రాజు, కొరివి తిరుపతి, గ్రామ సోషల్ మీడియా ఆక్టివేటర్ మెరుగు రజినీకాంత్, నాగపురి శ్రీధర్ గౌడ్, ఎల హరీష్, పైడిపాల శ్రీకాంత్, అన్నాజీ మధు తదితరులు పాల్గొన్నారు,
సంబరాలు చేసుకున్న బేగంపేట కాంగ్రెస్ శ్రేణులు
- Advertisment -