విజయవాడ, జనతా న్యూస్:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సమగ్ర కుల గణన సర్వే బుధవారం నుంచి ప్రారంభించనుంది. నవంబర్ 15,16న ఫైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని కులాల లెక్కలు తీయనున్నారు. దేశవ్యాప్తంగా 1931 చివరిసారిగా కులగణన నిర్వహించారు. ఆ తరువాత 96 ఏళ్లకు ఇప్పుడు కులగణన చేపడుతున్నారు. 1931 తరువాత కులలాలపై అంచనాలు వేసుకోవడం తప్ప నిర్ధిష్టమైన లెక్కలు లేవు. అయితే నిర్ధిష్టమైన కుల గణన చేపట్టడం ద్వారా సంక్షేమ ఫలాలు అందించడానికి మరింత సౌకర్యవంతంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుం ఫైలట్ ప్రాజెక్టు నిర్వహిస్తుండగా.. నవంబర్ 20 నుంచి పూర్తిస్థాయి సర్వే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేయనున్నారు.
నేటి నుంచి ఏపీలో కులగణన ప్రారంభం
- Advertisment -