భారతీయ జనతా పార్టీ స్టార్ క్యాంపెయినర్, సినీనటి నవనీత్ కౌర్ పై రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఎలక్షన్ కమిషనర్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. షాద్ నగర్ పట్టణంలో ఇటీవల జరిగిన మహబూబ్ నగర్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి డీకే అరుణ కు మద్దతుగా నవనీత్ కౌర్ ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఆమె చేసిన ప్రసంగంలో ఆక్షేపణలు ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ గుర్తించింది. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పాకిస్తాన్ కు ఓటేసినట్టేనని మాట్లాడిన వ్యాఖ్యలపై ఫ్లైయింగ్ స్క్వాడ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎన్నికల నిబంధన ప్రకారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో వివిధ సెక్షన్ల కింద ఎంపీ నవనీత్ కౌర్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఎంపీ నవనీత్ కౌర్ పై కేసు నమోదు
- Advertisment -