Thursday, March 12, 2026

ఎంపీ బండి సంజయ్ దిష్టి బొమ్మ దహనం

తిమ్మాపూర్, జనతా న్యూస్: రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఎంపీ బండి సంజయ్ దిష్టిబొమ్మను కరీంనగర్ జిల్లా అలుగునూర్ చౌరస్తా లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళ వారం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బండి సంజయ్ ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉండి కరీంనగర్ కు ఐదు రూపాయలు తీసుకురాలేదని, ఎన్నికల ముందు ప్రతిసారి కులం పేరిట, మతం పేరిట చిచ్చురేపి లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. బండి సంజయ్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, లేదంటే పాదయాత్రలో టమాటాలు, కోడిగుడ్డతో దాడి అదేవిధంగా జరుగుతుందని హెచ్చరించారు. ఎంపీగా ఉండి కరీంనగర్ ను ఎలా అభివృద్ధి చేయాలో చూడాలని, ప్రతిసారి మతంపేరిట, కులం పేరుతో చిచ్చురేపి లబ్ధి పొందడానికి బండి సంజయ్ ఇలా చేస్తున్నారని వారు ఆరోపించారు. ఎంపీ బండి సంజయ్ బే షరతుగా వాక్యాలు వెనక్కి తీసుకోవాలని లేకుంటే ఖబర్దార్ అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ ఇన్చార్జి గోపు మల్లారెడ్డి, కాల్వ మల్లేశం,vమాజీ సర్పంచ్ చిందం కిష్టయ్య, తొర్తి అరవింద్, ఎలకపల్లి సంపత్, మామిడి అనిల్, బుర్ర కనకయ్య, కంది లక్ష్మారెడ్డి, తమ్మనవేని రమేష్, మాచర్ల అంజయ్య, సింగం శ్రీనివాస్, మామిడి నరేందర్ రెడ్డి, పురం శెట్టి అనోహర్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page