టీజీ పీఎస్‌సీ ఆఫీసు ముట్టడి పిలుపుపై ఆరెస్టులు
కరీంనగర్-జనత న్యూస్
బీఆర్‌ఎస్ యూత్ లీడర్లను అరెస్టు చేశారు పోలీసులు. టీజీ పీఎస్‌పీ ఆఫీసు ముట్టడికి బీఆర్‌ఎస్ యూత్ పిలుపునివ్వడంతో నాయకులు వెల్లేందుకు ప్రయత్నించగా అడ్డుకుని ఆరెస్టు చేశారు పోలీసులు. కరీంనగర్ లోని ఆయా ప్రాంతాల నుండి తరలి వెళ్తున్న నాయకులను అదుపులోకి తీసుకుని ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో బీఆర్‌ఎస్ వీ జిల్లా అధ్యక్షుడు, మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి , తిరుపతి నాయక్ , చుక్క శ్రీనివాస్ , పటేల్ శ్రవణ్ రెడ్డి , ఆరే రవి గౌడ్ , పటేల్ సుదీర్ రెడ్డి, సోమిరెడ్డి రాజ నరేష్ రెడ్డి, కాటం సురేష్, తదితరులు అరెస్టు అయ్యారు. త్రీ టౌన్‌లో బీఆర్‌ఎస్‌వీ నగర అధ్యక్షులు బొంకూరి మోహన్, వన్ టౌన్ లో బీ ఆర్ యూత్ అధ్యక్షులు దీకొండ కులదీప్, సాయికృష్ణ , తదితరులు అరెస్టు అయ్యారు. తమను అరెస్టు చేసేందుకు పెట్టిన శ్రద్ధ నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో చూపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని.. నిర్భందిస్తే ఉద్యమాలు ఉదృతమౌతాయని హెచ్చరించారు.