కరీంనగర్ టౌన్, జనతా న్యూస్:కరీంనగర్ లోని ఒకటో డివిజన్ పరిధిలో బీఆర్ఎస్ నాయకులు విస్తృతంగా ప్రచారం చేశారు. నగరంలోని ఒకటో డివిజన్ పరిధిలోని 72, 73వ బూత్ నెంబర్ లోని చంద్రపురి కాలనీలో బీఆర్ఎస్ డివిజన్ ఇన్ చార్జి దాసరి సాగర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ ను గెలిపించాలని ఇంటింటికి తిరిగి కోరారు. కేసీఆర్ నాయకత్వంలో గంగుల కమలాకర్ చేసిన అభివృద్ధి పనులు, బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాల గురించి ఓటర్లకు చెప్పారు. గంగుల కమలాకర్ ను నాలుగవసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని, కేసీఆర్ ను మూడోసారి చేయాలని ఓటర్లకు వివరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ ఇంచార్జి దాసరి సాగర్, ఒకటో డివిజన్ అధ్యక్షుడు దాసరి వినోద్, బూత్ కమిటీ కన్వీనర్లు కో- కన్వీనర్లు చెల్లోజు రాజు, రవి, అల్లిబిల్లి నగేష్ ,, ఎన్నం లక్ష్మణ్, నీరుకుల్ల అనిల్ కుమార్, వొడ్నాల శ్రీహరి గంపల ఐలయ్య, వడ్లకొండ వినయ్, వెలుమల అరుణ్ కుమార్, నిశాని రాజగోపాల్, మొలంకాల సంతోష్, మెట్ట సాయి, యాదగిరి, ఐలవేణి రాజ్ కుమార్, తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.
కరీంనగర్ ఒకటో డివిజన్లో బీఆర్ఎస్ విస్తృత ప్రచారం
- Advertisment -