-
ఫైనల్స్ లో మోదీ, అమిత్ షాను ఓడించాలి..
-
బీజేపీ,బీఆర్ఎస్ చీకటి ఒప్పందంతో ప్రచారం చేస్తున్నారు..
- సీఎం రేవంత్ రెడ్డి
కరీంనగర్,జనత న్యూస్:డిసెంబర్ లో జరిగిన సెమీ ఫైనల్స్ లో బిల్లా రంగా ను ఓడించాం…ఫైనల్స్ లో మోదీ, అమిత్ షాను ఓడించాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.శుక్రవారం సిరిసిల్ల జన జాతర సభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.కరీంనగర్ ఎంపీగా పోటీ చేస్తున్న వినోద్ రావు అపర మేధావి,బండి సంజయ్ అరగుండు మేధావని.. కరీంనగర్ జిల్లాకు బీజేపీ, బీఆర్ఎస్ పదేళ్లు ద్రోహం చేశారన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ హక్కులను పట్టించుకోలేదని,పాలమూరు,రంగారెడ్డికి జాతీయ హోదా ఎన్నికలని అవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ అంటేనే బిల్లా రంగా సమితి అని అసెంబ్లీ ఎన్నికల్లో బిల్లా రంగాలను ప్రజలు బండకేసి కొట్టారని అన్నారు .రాష్ట్రంలో బీఆర్ఎస్ ను బొంద పెట్టాం.. బీజేపీ ఢీ కొట్టాలన్నారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను,హక్కులు,నిధులు ఇవ్వకుండా అవమానించిన మోదీ రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు ఉందా..?అంటూ ప్రశ్నించారు. కోనసీమ నుంచి చిత్రసీమ వరకు అన్నీ ట్విట్టర్లోనే ట్విట్టర్ టిల్లు మాట్లాడుతాడని..రిజర్వేషన్ల రద్దుకు మోదీ ప్రయత్నిస్తుంటే కేటీఆర్ ఎందుకు మాట్లాడటం లేదు..?2022 పిబ్రవరిలో రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ మాట్లాడారని,400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని,రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ అంటోందని చెప్పారు.
సిరిసిల్ల చేనేత కార్మికులకు కేటీఆర్ రూ. 275 కోట్లు ఉద్దెర పెట్టి పోయాడని,.నేతన్నలను ఆదుకోవడానికి తక్షణమే 50 కోట్లు విడుదల చేశామన్నారు.పదేళ్లు అధికారంలో ఉండి మిడ్ మానేరు ముంపు బాదితులను కేసీఆర్ పట్టించుకోలేదని అగ్రహం వ్యక్తం చేశారు.గాలికి వచ్చి గాలికి పోతారని అనుకుంటున్నారేమో.. కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నో కష్టాలు పడి ప్రభుత్వాన్ని తెచ్చారు.. బిడ్డా.. దిగు అంటే తొక్కుతం..నల్లమల అడవుల నుంచి తొక్కుకుంటూ వచ్చానని బీఆర్ఎస్ పార్టీని హెచ్చరించారు.40 కోట్ల ఆడబిడ్డలు ఆర్టీసీ లో ఉచితంగా ప్రయాణం చేశారు.మోదీ, కేసీఆర్ సిలిండర్ ను 1200 రూపాయలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 500 వందలు చేసింది నిజం కాదా.?అంటూ ప్రశ్నించారు.60 లక్షల కుటుంబాలకు రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నామని..22వేల కోట్లతో నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని ప్రకటించారు.మూడు నెలల్లో 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగుల కళ్లలో ఆనందం చూశామన్నారు.పేదలను ఆదుకునేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని..కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు విద్యావంతుడు.. పార్లమెంట్ లో ఉండాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు.