తాజా సుప్రిం కోర్టు తీర్పుతో అంతర్మథనం
హైదరాబాద్ :
ఓటుకు నోటు కేసు విచారణను ఇతర రాష్ట్ర న్యాయస్థానానికి మార్చాలని సుప్రిం కోర్టులో బీఆర్‌ఎస్ నేత జగదీశ్ రెడ్డి వేసిన పిటిషన్‌పై వచ్చిన తీర్పు బీఆర్‌ఎస్ పార్టీకి వ్యతిరేకంగా రావడంతో ముఖ్య నేతల్లో అంతర్మథనం మొదలైంది. ఇటీవలనే రాష్ట్ర హైకోర్టులో నల్గొండ బీఆర్‌ఎస్ భవనం కూల్చివేతపై వచ్చిన తీర్పుతో పాటు.. తాజా తీర్పు ఆ పార్టీకి ఇబ్బందిగా మారింది. ఓటుకు నోటు కేసు విచారణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభావితం చేసే అంశాలపై సుప్రిం కోర్టులో పిటిషనర్ ఆధారాలు చూపక పోవడంతో న్యాయమూర్తి మొట్టికాయలు వేశారు. హైకోర్టులో న్యాయ విచారణపై అనుమానాలు వ్యక్తంచేయడాన్ని తప్పు పట్టింది న్యాయస్థానం. ఏ రాష్ట్రంలోనైనా అదే విచారణ కొనసాగుతుందని, అయితే విచారణను ప్రబావింతం చేసే ఆధారాలుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించ వచ్చునని కోర్టు పిటీషనర్‌కు సూచించింది.
బీఆర్‌ఎస్‌కు ఎదురు గాలి..

- Advertisment -