కరీంనగర్, జనతా న్యూస్ : అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న కొద్ది బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని విస్తృతం చేస్తుంది. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న గంగుల కమలాకర్ తరపున ఆ పార్టీ నాయకులు వాడవాడలా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా మాజీ కార్పొరేటర్ వారాల నారాయణ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు 15వ డివిజన్లో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. మూడు పర్యాయాలుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన గంగుల కమలాకర్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారని వివరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు విద్యాసాగర్, శ్రీనివాస్, రాజు, నజీర్లతో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు
కరీంనగర్ డివిజన్లలో బీఆర్ఎస్ విస్తృత ప్రచారం
- Advertisment -