(మానకొండూర్ నియోజక వర్గ ప్రత్యేక ప్రతినిధి జనత న్యూస్ ):మండల కేంద్రమైన బెజ్జంకిలో భారత రాష్ట్ర సమితి నాయకులు పలువురు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పిస్తూ పలువురు కార్యకర్తలు నాయకులు హాజరై ప్రచార పర్వం శనివారం సాయంత్రం నిర్వహించారు. నమూనా బ్యాలెట్ తో ఓటు వేసే విధానాన్ని పలువురు వ్యాపారస్తులకు ప్రజలకు చూపుతూ అవగాహన కల్పించారు. ఎడ్ల బండి చౌరస్తా నుండి పలువురు బీఆర్ఎస్ నాయకులు అంబేద్కర్ చౌరస్తా మీదుగా గ్రామంలోని అందరు వ్యాపారస్తులను కలుస్తూ ప్రచారపర్వం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు లింగాల లక్ష్మణ్, గుబిర మల్లేశం,వంగ నరేష్, బండారి రాములు, బండి రమేశ్ కొక్కుల రాజు పండరి చెరుకూరు నరసయ్య తాడిచెట్టు భూమయ్య అయిలేని నరసింహారెడ్డి సంఘ నరేష్ మహేష్ రాజు టేకు రాంచేంద్రం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బెజ్జంకి లో బీఆర్ఎస్ ప్రచారం
- Advertisment -