సంగారెడ్డి, జనత న్యూస్: తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే కొంత మంది ప్రజాప్రతినిధులు పార్టీని వీడగా తాజాగా ఎంపీ పార్టీకి రాజీనామా ప్రకటించారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ గులాబీ పార్టీకీ దూరమయ్యారు. త్వరలో ఆయన బీజేపీలో చేరనున్నారు. ఓ వైపు త్వరలో లోక్ సభ ఎన్నికల కారణంగా ఆ పార్టీ టికెట్ల కేటాయింపుపై కసరత్తు చేస్తుండగా.. మరోవైపు పార్టీని ఒక్కొక్కరు వీడడం కలకలం రేపుతోంది. లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వరకు ఎంతమంది పార్టీలో ఉంటారోనన్న చర్చ సాగుతోంది.
Brs: బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్.. ఆ ఎంపీ రాజీనామా..
- Advertisment -