హైదరాబాద్, జనతా న్యూస్: భారతీయ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంట్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ తో సహా పల చోట్ల ఒకేసారి తనిఖీలు నిర్వహించడం కలకలం రేపుతోంది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత కు ఇప్పటికే నోటీసులు అందించిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం ఢిల్లీ నుంచి వచ్చిన కొందరు అధికారులు కవిత ఇంట్లో సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఈడీ సోదాల నేపథ్యంలో కవిత ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
For Janatha E Paper.. Click Here
Daily News E-Paper: Latest News and Insights from Telangana (janathadaily.in)