Thursday, July 3, 2025

అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు

  •  శ్రీ భద్రకాళి బద్రిశ్వర కళ్యాణ ఉత్సవాలకు హాజరైన నగర మేయర్
  •  అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు
  •  కుంకుమార్చన, రథోత్సవంలో పాల్గొన్న పద్మశాలి కులస్తులు
  •  పెద్ద ఎత్తున తరలివచ్చిన
  • పద్మశాలీలు, ప్రత్యేక పూజలు
  •  మహా అన్నదానం
  •  చక్రస్థానంతో ముగిసిన బ్రహ్మోత్సవాలు

హనుమకొండ, జనతా న్యూస్: వరంగల్ జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో చల్లంగా ఉండాలని, అమ్మవారి దీవెనలు అందరిపై ఉండాలని , ఈ ఏడు సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని భద్రకాళి అమ్మవారిని మొక్కుకున్నరు నగర మేయర్ గుండు సుధారాణి. భద్రకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఆలయంలో అంగరంగ వైభవంగా కొనసాగాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించి చలువ పందిల్లను ఏర్పాటు చేశారు. ప్రతిరోజు అమ్మవారికి అభిషేకాలు పూజలు నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేందర్ శర్మ. భద్రకాళి ఆలయంలో జరుగుతున్న కళ్యాణ ఉత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా అఖిలభారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి కులస్తులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.

భద్రకాళి బద్రిశ్వర స్వామి కళ్యాణ ఉత్సవాలకు నగర మేయర్ గుండు సుధారాణి ప్రభాకర్ దంపతులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని మనసారా వేడుకున్నారు. అనంతరం సుధారాణి మహిళలతో కలిసి సామూహిక కుంకుమార్చనలో పాల్గొని ప్రత్యేక పూజలు చేపట్టారు. అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకోగా కళ్యాణ ఉత్సవాలకు పద్మశాలి కులస్తులు పెద్ద ఎత్తున హాజరై భక్తి తో వేడుకున్నారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు సామంతుల శ్రీనివాస్, హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు బచ్చు ఆనందం, ఆడెపు రవీందర్, కాశిబుగ్గ కార్పొరేటర్ గుండేటి నరేందర్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల శ్రీనివాస్, పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి నరేందర్, రాష్ట్ర నాయకులు బాసని శ్రీనివాస్, కుసుమ సతీష్, సాంబారి సమ్మారావు, మల్లయ్య, దాసరి సుధాకర్, ఎస్ఆర్ఎఫ్ అధ్యక్షులు తుమ్మ అమరేశ్, పూజారి సత్యనారాయణ చారి, పద్మశాలి ప్రముఖులు,కులస్తులు పాల్గొన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page