Sunday, July 6, 2025

Bopal : త్రీ ఇడియట్ సినిమా తరహాలో సాహసం.. తాతను కాపాడిన మనవడు..

Bopal : బాలీవుడ్ లో వచ్చిన  త్రీ ఇడియట్ సినిమా గురించి ఎవరు మరిచిపోరు. తెలుగు దీనిని ‘స్నేహితుడా’ పేరుతో రీమేక్ సినిమా కూడా వచ్చింది. ఈ సినిమాలో ముగ్గురి హీరోల్లో ఒకరి తాతకు ఒక్కసారిగా శ్వాస ఆడదు. దీంతో బైక్ పై అతడిని హాస్పిటల్ కు తీసుకెళ్లి కాపాడుతారు. ఇదే తరహాలో ఓ మనువడు తన తాతను కాపాడుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ లోని సత్నా జిల్లాలో నీరజ్ గుప్తా తాత శనివారం అర్దరాత్రి తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. దీంతో నీరజ్ వెంటనే మరొకరితో కలిసి తన బైక్ పై కూర్చొబెట్టుకొని సమీప ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే ఆ బైక్ ను నేరుగా ఎమర్జున్జీ వార్డు వరకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది వెంబడించినా ఆగకుండా ఎమర్జెన్సీ వార్డు వద్ద తన తాతను స్ట్రెచ్చర్ పై పడుకోబెట్టాడు. మొత్తానికి తన తాతను కాపాడుకున్నాడు. ఇలా చేసినందుకు డాక్టర్ మందలించినా అతని సాహసాన్ని చూసి మెచ్చుకుంటున్నారు.
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page