Wednesday, July 2, 2025

బాలీవుడ్‌ రియాల్టీ షోలో తెలుగు నటి

బిగ్‌బాస్‌ తరహాలో బాలీవుడ్‌లో రియాలీ రాణీస్‌ ఆఫ్‌ ది జంగిల్‌ షోను నిర్వహిస్తున్నారు. డిస్కవరీ ఇండియా ఛానల్‌లో ప్రతీ సోమ, మంగళ వారాల్లో రాత్రి 10 గంటలకు ఈ షో ప్రసారం అవుతుంది. అడవిలో ప్రమాదాలను ఎదుర్కొంటూ సాహసం చేసే ఈ ప్రదర్శనలో 12 మంది మహిళా సెలబ్రెటీలు పాల్గొంటున్నారు. ఈ షోలో తెలుగు నటి తేజస్వీని ముదివాడ పాల్గొనడం విశేషం. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం ద్వారా పరిచమైన ఆ నటి, రాంగోపాల్‌ వర్మ సినిమాలో హీరోయిన్‌గా నటించి ఆదరాభిమానాలు పొందింది. గతంతో బిగ్‌బాస్‌లోనూ పాల్గొన్న తెజస్వీ..తాజాగా బాలీవుడ్‌ రియాల్టీ షోలో, అదికూడా అడవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న రియాల్టీ షోలో పాల్గొనడం ప్రత్యేకత సంతరించుకుంటుంది. 12 మందిలో జంగిల్‌ రాణి టైటిల్‌ ఒక్కరికే దక్కుతుంది. ఆ జంగిల్‌రాణి టైటిల్‌ విన్నర్‌ పక్కన బెడితే..అడవిలో ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవడం కూడా ముఖ్యమని పలువురు నెటిజన్లు సూచిస్తున్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page