-
డాక్టర్ రసమయి బాలకిషన్.
జనతా న్యూస్ బెజ్జంకి : మానకొండూరు నియోజకవర్గం బిఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ రసమయి బాలకిషన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం బెజ్జంకి మండలంలో దేవక్కపల్లి తోటపల్లి వీరాపూర్ లక్ష్మీపూర్ బేగంపేట్ వడ్లూర్లలో పర్యటించారు. ఆయా గ్రామాలలో పెద్ద ఎత్తున మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రసమయి మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించి తెలంగాణ నేలను సశశ్యామలం చేసిన బిఆర్ఎస్ పార్టీ, అపర భగీరథుడు కెసిఆర్ కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో తనను గెలిపిస్తే మరింత అభివృద్ధి పథంలో తెలంగాణ దూసుకుపోతుందని పేర్కొన్నారు. ఆచరణ సాధ్యం కానీ హామీలతో అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుందని, నమ్మి మోసపోవద్దని ఓట్లకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిర్మల లక్ష్మణ్, జెడ్పిటిసి కవిత తిరుపతి, మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రకళ రాజయ్య, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధికార ప్రతినిధి బోనగిరి శ్రీనివాస్, జిల్లా రైతు సమన్వయ కమిటీ సభ్యులు ఐల పాపయ్య, బేగంపేట సర్పంచ్ చింతలపల్లి సంజీవరెడ్డి, మాజీ ఎంపీపీ చింతలపల్లి రవీందర్ రెడ్డి, బేగంపేట గ్రామ శాఖ అధ్యక్షుడు మామిడాల లక్ష్మణ్, తోటపల్లి సర్పంచ్ నరసింహారావు, వీరాపూర్ సర్పంచ్ బాల సుధీర్రావు, వీరాపూర్ ఉపసర్పంచ్ హర్షణ పెల్లి అంజయ్య, చిలుముల దేవదాస్, లక్ష్మీపూర్ నాయకులు సర్పంచ్ తిరుపతిరెడ్డి, ఎంపీటీసీ ముక్కిస రాజిరెడ్డి, మాజీ ఎంపీటీసీ పోరంల అధ్యక్షులు ముక్కిస తిరుపతి రెడ్డి, వడ్లూరు సర్పంచ్ నలువాల అనిత స్వామి, గుండారం ఉపసర్పంచ్ తాళ్లపల్లి రాము గౌడ్, దాచారం సర్పంచ్ పెంట మీది శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర నాయకులు బోయినపల్లి శ్రీనివాసరావు, చింత గింజ శ్రీనివాస్ గుప్తా, నాయకులు దీటి రాజు, దిటి బాల నర్సు, యువ నాయకులు మానకొండూరు సోషల్ మీడియా ఇంచార్జ్ ఎలా శేఖర్ బాబు, బిగుల్లా మోహన్, వంగ నరేష్, బిగుల సుదర్శన్, కొరివి తిరుపతి ముదిరాజ్, రాజు గాని పవన్ కళ్యాణ్, బెజ్జంకి సతీష్, జనగం కుమార్, ముత్యాల వెంకటరెడ్డి, మెరుగు రజినీకాంత్ నేత, కొరివి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.