- మంత్రి గంగుల కమలాకర్.
కరీంనగర్ టౌన్ నవంబర్ 01 ( జనతా న్యూస్)కరీంనగర్ ప్రజల ఆశీర్వాద బలమే నాకు కొండంత బలమని నన్ను మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ది చేసి చూపిస్తానన్నారు మంత్రి గంగుల కమలాకర్. కాంగ్రెస్, బిజెపిలు ఢిల్లీ పార్టీలని ఆ పార్టీలకు ఓటు వేస్తే తెలంగాణ మరోసారి గుడ్డిదీపం అవుతుందన్నారు. కరీంనగర్ లో జిల్లా ప్లంబర్ అసోసియేషన్ ఫోర్ వీలర్స్ మెకానిక్స్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళాన కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్, మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ ఫ్లంబర్, ఫోర్ వీలర్స్ మెకానిక్స్ సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటానని హామి ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ 2009, 2014, 2018 ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాలు కట్టబెట్టిన కరీంనగర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. హ్యాట్రిక్ విజయాలు కట్టబెట్టిన మీరుణం తీర్చుకునేందుకు శాయశక్తుల కృషి చేస్తున్నానని స్పష్టం చేశారు. తెచ్చుకున్న తెలంగాణ ఇప్పుడిప్పుడే అభివృద్దిలో దూసుకుపోతుందని అభివృద్ది చెందుతున్న తెలంగాణను మరోసారి దొంగల పాలు చేయొద్దని కోరారు. కెబుల్ బ్రిడ్జీ, మానేరు రివర్ ఫ్రంట్ లతో ఇక్కడి యువకులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. మన ముత్తాతలు చేసిన తప్పుకు 50 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం లో దరిద్ర్యాన్ని చూశామని ఇప్పుడు మనం తప్పు చేస్తే మరో 50 సంవత్సరాల మన భవిష్యత్ తరాలు దరిద్రాన్ని చూసే ప్రమాదముందని అన్నారు. నెల రోజులు నా కోసం కష్టపడితే 5 సంవత్సరాలు మీకోసం నేను కష్టపడుతానని హామి ఇచ్చారు. ఎన్నికల వేళ కాంగ్రెస్, బిజెపిలు ఓట్ల కోసం వస్తున్నారని మీ పవిత్రమైన ఓటును ఆ పార్టీలకు వేసి వృధా చేయొద్దన్నారు. మరోసారి నాకే ఓటు వేసి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ది చేసి చూపిస్తానని హామి ఇచ్చారు. మరో వైపు మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ తెచ్చుకున్న పచ్చని తెలంగాణ సంపదను మల్లీ దోచుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఆచరణకు సాధ్యం కాని మోస పూరిత హామీలతో ప్రజలను మభ్య పెడుతూ మల్లీ ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని మండి పడ్డారు. గత 50 ఏళ్ళు అధికారంలో ఉండి ప్రజలను పట్టించుకోక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టక అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేశారని ద్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం లో అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు కేసీఆర్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. మంత్రి గంగుల కమలాకర్ ను మరో సారి మీరు ఆశీర్వదించి కేసిఆర్ చేతులు మరింత బలోపేతం చేస్తే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ అసోసియేషన్ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.