హైదరాబాద్, జనతా న్యూస్ : తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తుది జాబితాను విడుదల చేసింది. ఇప్పటి వరకు నాలుగుజాబితాలను విడుదల చేసిన బీజేపీ తాజాగా ఫైనల్ గా అభ్యర్థులను ప్రకటించింది. శుక్రవారం నామినేషన్లు చివరి రోజు కావడంతో ఉదయాన్నే వెళ్లి నామినేషన్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు 100 స్థానాలను ప్రకటించిన బిజేపీ తాజాగా మరో 8 మంది పేర్లను ప్రకటించింది. మూడు స్థానాలను శుక్రవారం ప్రకటించే అవకాశం ఉంది.
పెద్దపల్లి -దుగ్యాల ప్రదీప్ కుమార్
శురి లింగంపల్లి -రవి కుమార్ యాదవ్
కంటోన్మెంట్ -కృష్ణ ప్రసాద్
మల్కాజిగిరి -రామచంద్రరావు
సంగారెడ్డి -పులిమామిడి రాజు
నాంపల్లి -రాహుల్ చంద్ర
మేడ్చల్ -విక్రమ్ రెడ్డి
వనపర్తి -సతీష్ అనుజ్ఓరెడ్డి