ఉద్యోగం, వ్యాపరంలో ఒత్తిడి కారణంగా చాలా మందికి మతిమరుపు తీవ్రమైన సమస్యలా తయారవుతోంది. దీంతో కొన్ని వస్తువులను ఎక్కడ పెట్టామో తెలియక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఇలాంటి సమయంలో ఏదైనా అలారం ఉండే వస్తువు ఉంటే బావుండు.. అని చాలా మంది అనుకుంటున్నారు. ఈ తరుణంలో ఓ పరికరం అందుబాటులోకి వచ్చింది. బైక్ ఎక్కడున్నా ఇది పసిగట్టి వెంటనే అలారం వచ్చేలా చేస్తుంది. దీనిని స్మార్ట్ ఫోన్ కు అనుంధానం చేసుకుంటే బైక్ దొరకకపోయినా.. ఎవరైనా దొంగించినా వెంటనే చెప్పేస్తుంది.
ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీ శాంసంగ్ నుంచి ‘గెలాక్సీ స్మార్ట్ ట్యాగ్ 2’ అందుబాటులోకి వచ్చింది. ఇది బైక్స్, కార్లు, కీచైన్లు ఇలా విలువైన వస్తువులు ఎక్కడున్నా చెప్పేస్తుంది. పెంపుడు జంతువులకు కూడా దీనిని అనుసంధానం చేసుకోవచ్చు. ఆల్ట్రా వైడ్ బ్యాండ్, బ్లూటూత్ టెక్నాలజీ ద్వారా ఇది పనిచేస్తుంది. దీనిని స్మార్ట్ ఫోన్ కు అనుసంధానం చేసుకుంటే బైక్ దొరకకపోయినా, కనిపించకపోయినా అలారం వస్తుంది. అయితే ఇది కేవలం రెండేళ్లు మాత్రమే పనిచేస్తుంది. దీనిని స్నేహితులకు బహుమతిగా ఇవ్వొచ్చంటున్నారు నిపుణులు. దీనిని రూ.2,496తో విక్రయిస్తున్నారు.