పెద్దపల్లి, జనతా న్యూస్:పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారత రాష్ట్ర సమితికి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి గతంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన వెంకటేశ్ నేత రాజీనామా చేశారు. త్వరలో కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు ప్రకటించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోకాంగ్రెస్ తరుపున పోటీ చేసిన ఆయన బాల్క సుమన్ చేతిలో ఓడిపోయారు. అయితే 2019 లోక్ సభ ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ లో చేరి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా నిలబడి గెలిచారు. ఈ సమయంలో ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఎ. చంద్రశేఖర్ పై 95,180 ఓట్లతో గెలుపొందారు. 2019 సెప్టెంబర్ నుంచి 2020 సెప్టెంబర్ 12 వరకు విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న నేపథ్యంలో వెంకటేశ్ నేత ఆ పార్టీలోకి చేరడంతో వచ్చే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేస్తారని అనుకుంటున్నారు.
బీఆర్ఎస్‌కు భారీ షాక్.. ఆ ఎంపీ రాజీనామా..
- Advertisment -