హైదరాబాద్, జనతా న్యూస్: తెలంగాన ప్రభుత్వ గవర్నర్ తమిళ సై సుందర రాజన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆమె తమిళ నాడు లోని లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు.తమిళ సై తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్. ఈమె 2019 సెప్టెంబర్ 8న బాధ్యతలు స్వీకరించారు. పుదుచ్చేరి గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ 2021లో రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లా నాగర్ కోయల్ ప్రాంతంలో జన్మించిన తమిళ సై తండ్రి లోక్ సభ మాజీ సభ్యుడు. చిన్నతనం నుంచే రాజకీయాలపై ఆసక్తి ఉన్న తమిళ సై మద్రాసు వైద్య కళాశాలలో విద్యార్థి సంఘం నాయకురాలిగా పనిచేసింది. బీజేపీ వైపు ఆకర్షితురాలై 1999 దక్షిణ చెన్నై జిల్లా వైద్య విభాగం కార్యదర్శిగా, 20017లో అఖిల భారత కో కన్వీనర్ గా పనిచేశారు. 2014 నుంచి తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేసింది. అయితే 2006, 2011లో రెండు సార్లు శాసన సభ్యురాలిగా..2009, 2019లో రెండుసార్లు లోక్ సభ సభ్యురాలిగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం మరోసారి లోక్ సభ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.
Big Breaking News: తెలంగాణ గవర్నర్ తమిళ సై రాజీనామా
- Advertisment -