వరంగల్ ,జనతా న్యూస్: కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు జెన్నారెడ్డి భరత్ చంద్ రెడ్డి ఆధ్వర్యంలో మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ భూక్య మురళి నాయక్ . డోర్నకల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రామచంద్రనాయక్ సమక్షంలో తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో cheraru.డుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిధి నిరంతరం పేద ప్రజల సంక్షేమం కోసం పాటు పడుతూ అనేక అవార్డులు సైతం సొంతం చేసుకున్న ఉద్యమకారుడు, ప్రముఖ సామాజికవేత్త, సౌమ్యులు, అందరివాడు మహబూబాబాద్ ప్రాంత ముద్దుబిడ్డ గత ఎన్నికల్లో ఎంపీ మరియు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గణనీయంగా ఓట్లు సంపాదించిన భూక్యా బాలునాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు జెన్నారెడ్డి భరత్ చంద్ రెడ్డి మాట్లాడుతూ భూక్యా బాలునాయక్ కాంగ్రెస్ పార్టీలో రావడం కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో కలవడం కాంగ్రెస్ పార్టీకి మహబూబాద్ ,డోర్నకల్ నియోజవర్గంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు
భూక్యా బాలునాయక్ కి కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇస్తూ జిల్లా అధికార ప్రతినిధిగా నియమించారు. ఇంకా భవిష్యత్ లో రాష్ట్ర స్థాయి లో మంచి భాధ్యత కల్పించటానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా భూక్యా బాలునాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ కుటుంబంలో రావడం నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గ లలో గెలుపు కోసం తనవంతుగా కృషి చేస్తానని బిఆర్ఎస్ బిజెపి పార్టీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం రేపటినుండి తన అనుచరులతో ప్రచారం ముమ్మరం చేస్తామని తనకున్న పరిచయాలతో అనేక గ్రామాల్లో నా అభిమానులు నాకు ప్రేమించే వారు అందరూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో
యువజన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంకర అయ్యప్ప రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దెవరం ప్రకాష్ రెడ్డి, ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు దరవత్ సురేష్ నాయక్, కాంగ్రెస్ కురవి మండల నాయకులు సిల్వేర్ అనిల్ ,విష్ణు యాదవ్, నవీన్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ , యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు భూక్యా సురేష్ నాయక్. , ధరవత్ శ్రీను , వాసు నాయక్. యాకూబ్. రమేష్, బానోతు మోతిలాల్ ,గణేష్ తదితరులు పాల్గొన్నారు.