జనత న్యూస్ బెజ్జంకి: సివి రామన్ జన్మదినాన్ని పురస్కరించుకొని బెజ్జంకి మోడల్ స్కూల్లో బుధవారం ఏర్పాటుచేసిన సైన్స్ దినోత్సవంలో పాల్గొన్న మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపెల్లి సత్యనారాయణ కళాశాల ప్రిన్సిపాల్ ద్వారా విద్యార్థుల సమస్యను తెలుసుకొని, నూతన వంటశాల కోసం 5 లక్షల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. ఎమ్మెల్యే ఆదేశానుసారం శుక్రవారం బెజ్జంకి మాజీ ఎంపీపీ మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, ప్రిన్సిపాల్ హార్జిత్ కౌర్ శుక్రవారం నూతన వంటశాల నిర్మాణం కోసం స్థల పరిశీలన చేసి భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ అక్కెర వేణి పోచయ్య, ఉప సర్పంచ్ బండి వేణు, పట్టణ అధ్యక్షుడు బండిపెల్లి రాజు, గుర్రాల బాల్ నరసింహారెడ్డి, జెల్ల ప్రభాకర్ యాదవ్, ఇస్కిల్ల ఐలయ్య, బొనగం రాజేశం, ఐలేని మహేందర్ రెడ్డి, ఎలిగే సతీష్, గుబిరే చంద్రం, సంగం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వంటశాలకు భూమి పూజ
- Advertisment -
