తీవ్రంగా వ్యతిరేకించిన సిపిఎం పార్టీ మండల కార్యదర్శి తిప్పారం శ్రీనివాస్.
జనతన్యూస్ బెజ్జంకి : బెజ్జంకి మండలం నరసింహులపల్లి పోతారం గ్రామాల మధ్య ఏర్పాటు చేస్తున్నటువంటి ఇథనాల్ పరిశ్రమను ఆయా గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ యాజమాన్యాలు పోలీసు బందోబస్తు మధ్యన ప్రజాభిషానికి వ్యతిరేకంగా శుక్రవారం భూమి పూజ చేసినట్లు తమ పార్టీ దృష్టికి వచ్చిందని బెజ్జంకి మండలం సిపిఎం పార్టీ కార్యదర్శి తిప్పారం సురేష్ శనివారం పార్టీ కార్యకర్తల సమావేశంలో చర్చించారు.ఆయా గ్రామాల ప్రజలకు న్యాయం జరిగే వరకు పరిశ్రమ ఏర్పాటు చర్యలు నిలుపుదల చేసే వరకు ప్రజల న్యాయమైన డిమాండ్ నెరవేరేవరకు తమ పార్టీ తరపున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ప్రజా అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా దొంగ చాటున ప్రభుత్వ అనుమతులు తీసుకొచ్చి పోలీసులను కాపలా పెట్టి ఫ్యాక్టరీ నిర్మాణం చేపడితే తమ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేపడతామని యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు బొమ్మిడి సాయి కృష్ణ, సంఘ ఎల్లయ్య, బోనగిరి దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.