కరీంనగర్ :
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ భవానీ దీక్ష స్వీకరించారు. కరీంనగర్ చైతన్యపురి కాలనీ మహాశక్తి ఆలయంలో కుటుంబ సమేతంగా వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులతో కంకణం కట్టించుకుని మాలాధారణ చేశారు. ఆలయంలో భవనీ దీక్ష స్వాములతో కలసి ముచ్చటించారు. మహాశక్తి ఆలయంలో శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహించేలా చూడాలని నిర్వాహకులకు సూచించారు. ప్రతీ సంవత్సరం దసరా ముందు బండి సంజయ్ భవానీ మాలాధారణ స్వీకరిస్తుంటారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం కూడా దీక్ష చేపట్టారు కేంద్ర మంత్రి.
భవానీ దీక్ష తీసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్..

- Advertisment -