Bhagavanth Kesari: అనిల్ రావిపూడి డైరెక్షన్లో రిలీజ్ అయినా భగవంత్ కేసరి మూవీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. బాలకృష్ణ మీరోగా కాజల్, శ్రీలీలను నటించిన ఈ మూవీ సెంటిమెంట్ చిత్రంగా ప్రేక్షకాదరణ పొందతోంది. ఇటీవలే ఈ సినిమాలో కొత్త పాటను యాడ్ చేశారు. బాలకృష్ణ ఒకప్పటి సక్సెస్ ఫుల్ మూవీ ‘మంగమ్మగారి మనవడు’ సినిమాలోని ‘దంచవే మేనత్త కూతురా’ అనే సాంగ్ ను కొత్తగా పెట్టారు. ఈ సందర్భంగా మూవీ టీం తాజాగా ఏపీలోని విజయవాడ కనకదుర్గ ఆలయంలో కనిపించారు. ఆలయంలో అమ్మవారికి చిత్రబృందం ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఈ సందర్భంగా శ్రీలీల సాంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. వీరిలో డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఉన్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
