జనత న్యూస్ బెజ్జంకి : భారత స్వాతంత్ర యోధుడు భగత్ సింగ్ 93వ వర్ధంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద భగత్ సింగ్ చిత్రపటానికి అఖిల భారత యువజన సమైక్య ( ఏఐవైఎఫ్ ) ఆధ్వర్యంలో శనివారం పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి బోనగిరి రూపేష్ మాట్లాడుతూ దేశ విముక్తి కోసం విప్లవ మార్గాన్ని ఎంచుకొని బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఎర్ర కరపత్రాలను ప్రజలకు పంచుతూ ప్రజలను చైతన్య పరుస్తూ దేశ స్వాతంత్రం కోసం తన వంతు కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి భగత్ సింగ్ అని పేర్కొన్నారు. భారతరత్న బిరుదునిచ్చి, జయంతి,వర్ధంతిలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని పేర్కొన్నారు. నేటి యువత భగత్ సింగ్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోతిరెడ్డి వెంకటరెడ్డి, ఏఐవైఎఫ్ మండల ప్రధాన కార్యదర్శిదొంతర వేణి మహేష్,నాయకులు బోనగిరి శేషు కుమార్, మిద్దె రవి, బోనగిరి శ్రావణ్, నరసయ్య, సత్తయ్య, మహంకాళి బాబు, తదితరులు పాల్గొన్నారు.
భగత్ సింగ్ ఆశయ సాధన కోసం కృషి చేయాలి
- Advertisment -