- గౌడ సంఘం ఆత్మీయ సమావేశంలో వెలిచాల రాజేందర్
- ఆయన స్ఫూర్తితో పార్లమెంట్ లో గళం విప్పుతానని స్పష్టం
- ఒక్కవకాశం ఇచ్చి ఆశీర్వదించండని అభ్యర్థన
కరీంనగర్,జనత న్యూస్:ఇప్పటివరకు కరీంనగర్ నియోజకవర్గంలో ఎంతోమంది ఎంపీలను చూశానని పొన్నం ప్రభాకరన్న ఉత్తమ ఎంపీగా తన మదిలో ఎప్పుడు మెదులుతారని కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ నగరంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో గౌడ సంఘం ఆత్మీయ సమావేశానికి మంత్రి పొన్నంతో కలిసి రాజేందర్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజేందర్ రావు మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అయితే.. పేపర్ స్ప్రే పోరాటం చేసి తెలంగాణ ఏర్పాటుకు నాంది పలికిన పొన్నం ప్రభాకర్ అంటే తనకు తీవ్రమైన అభిమానం అని ఉద్ధాటించారు. గతంలో ఏ ఎంపీ సాధించినన్ని పనులు సాధించిన ఘనుడు పొన్నం ప్రభాకర్ అని, పార్లమెంట్లో 850 ప్రశ్నలను సంధించి, కరీంనగర్ కు ఎన్నో అభివృద్ధి పొలాలను తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఆయన స్ఫూర్తితోనే తాను ఎంపీగా గెలిచిన తర్వాత పొన్నం మాదిరిగా పార్లమెంట్ల వ్యవహరించినందుకు ప్రయత్నం చేస్తానని, కరీంనగర్ అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ తో కరీంనగర్ కు ఒరిగిందేమి లేదని, సొంత ప్రయోజనాలు మినహా ప్రజా సమస్యల పట్ల ఆలోచనలేని బండి సంజయ్ కు, కరీంనగర్ ఎంపీగా ఉండి వరంగల్ పై ప్రేమ చూపిన బోయినపల్లి వినోద్ కు తగిన బుద్ధి చెప్పి హస్తం గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థి అయిన తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ సమాజంలో గౌడ సంఘ నేతలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
తుది శ్వాస వరకు.. మీ సేవకే నా జీవితం
తన తుది శ్వాస విడిచే వరకు కరీంనగర్ ప్రజల సేవకే తన జీవితం అంకితమని కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. కరీంనగర్ రూరల్ మండలంలోని బొమ్మకల్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. తొలుత గ్రామ శివారులోని శ్రీ సీతారామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం రోడ్ షో ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు రాజేందర్ రావుకు ఘన స్వాగతం పలికారు. గ్రామ శివారు రామాలయం నుండి పంచాయతీ కార్యాలయం వరకు రోడ్ షో నిర్వహించి అక్కడ రూరల్ మండలం కాంగ్రెస్ అధ్యక్షుడు రామ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్నర్ మీటింగ్ లో ప్రసంగించారు. ఇక్కడ ప్రజలకు తన కుటుంబంతో మంచి సాన్నిహిత్యాలు ఉన్నాయని, సగానికి పైగా గ్రామస్తుల పేర్లు తన తండ్రికి తెలుసునని తెలిపారు. దివంగత జగపతిరావు ఆశయ సాధన కోసం, బొమ్మగల్ గ్రామ అభివృద్ధి కోసం హస్తం గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీని వీడి రాజేందర్రావు సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.