జనతన్యూస్ బెజ్జంకి : బెజ్జంకి మండలం నరసింహులపల్లి పోతారం గ్రామాల మధ్య నిర్మించ తలపెట్టిన ఇథనాల్ పరిశ్రమ ను నిర్మించవద్దని గత కొన్ని రోజుల నుండి ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం విధితమే అయితే మంగళవారం పరిశ్రమ యాజమాన్యాలు భూసార పరీక్షల నిమిత్తం అధికారులతో కలిసి గ్రామంలోకి రావడంతో పెద్ద ఎత్తున ప్రజలు వారిని అడ్డుకొని నిరసన తెలిపారు. బెజ్జంకి ఎస్ ఐ జి.కృష్ణారెడ్డి భూసార పరీక్షల నిమిత్తం వారు వచ్చినట్లు పరీక్షలు ఒకే అయితేనే మీ ప్రాంతంలో పరిశ్రమ నిర్మిస్తారని లేకుంటే లేదని, పరీక్షల అనంతరం గ్రామస్తులతో ఇథనాల్ పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడిస్తానని హామీ ఇవ్వడంతో ప్రజలు వారికి అడ్డు తొడిగారు.
బెజ్జంకి: ఆగని ప్రజా నిరసనలు
- Advertisment -