బెజ్జంకి టౌన్, జనత న్యూస్: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలకేంద్రంలోని వాణీనికేతన్ హైస్కూల్ విద్యార్థులు అభాకస్ జిల్లాస్థాయి పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబర్చారు. కరీంనగర్ లో జరిగిన ఇంటర్ స్కూల్ పోటీలలో రాణించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులలో గుండెల్లి విష్ణుప్రియ, తీగల అవంతిక, నాంపెల్లి రిత్విక, సుదగోని పెద్దోళ్ళ సిరి అనే విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
వనరాశి శైలజ, గుంజి సూర్యఅభిలాష్, వజ్జపల్లి హాసిత్, మహమ్మద్ సల్మాన్, గుండెల్లి ఆరుష్ లు ఉత్తమంగా నిలిచి బహుమతులు అందుకున్నారు. పాఠశాల ఆవరణలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కరస్పాండెంట్ తూముకుంట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతు విద్యార్థులలో సృజనాత్మకతను వెలికితీయడానికి అబాకస్ దోహదపడుతుందన్నారు. అబాకస్ ద్వారా విద్యార్థులలో మానసిక ఒత్తిడి తగ్గుతుందన్నారు. ఈసందర్భంగా విజేతలుగా నిల్చిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనిధి. అబాకస్ టీచర్లు రమేష్, రాజు, సుమంగళి, రాజులతో పాటు ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
‘అబాకస్’ లో బెజ్జంకి విద్యార్థుల ప్రతిభ
- Advertisment -