జనత న్యూస్ బెజ్జంకి: అంబేద్కర్ ఫెలోషిప్ నేషనల్ అవార్డు 2023 పురస్కారాలు ఢిల్లీలో 39వ దళిత రచయితల జాతీయ సదస్సు సందర్భంగా ప్రదానం చేయనున్నారు. ఈ పురస్కారానికి మండలంలోని కల్లేపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి ఇల్లంతకుంట మండలం రహీమ్ ఖాన్ పేట మోడల్ స్కూల్ లో హిందీ ఉపాధ్యాయుడు బిగ్గుళ్ళ బాబు ఎంపికయ్యారు.బాబు హిందీ నవలలో దళిత చైతన్యం, సాహిత్య, సాంస్కృతిక సేవలకు గుర్తింపుగా భారతీయ దళిత సాహిత్య అకాడమీ ద్వారా అవార్డును అందుకోనున్నారు. అవార్డు రావడం పట్ల బెజ్జంకి వివేకానంద యువజన సంఘం అధ్యక్షుడు శానగొండ రజినీకాంత్, భరత్, రమేష్, పట్నం రమేష్ ,ప్రేమ్ అనిల్, శ్రీనివాస్ ,సాగర్ ,కల్లేపల్లి గ్రామ ప్రజలు అభినందనలు తెలిపారు.
బెజ్జంకి: మండల వాసికి జాతీయ పురస్కారం
- Advertisment -