జజనతా న్యూస్, బెజ్జంకి : బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి జెల్ల ప్రభాకర్ యాదవ్ శనివారం పార్టీకి మరియు పదవికి రాజీనామా సమర్పించిన విషయం తెలిసిందే. అయితె తన అనుచర వర్గంతో ఆదివారం కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మానకొండూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జెల్ల ప్రభాకర్ మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీ తోనే ఎన్ ఎస్ యు ఐ విద్యార్థి నాయకుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించానని,ఐతే ఉద్యమ సమయంలో స్వ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ స్థాపించిన “తెలంగాణ రాష్ట్ర సమితి”లో చేరి, తెలంగాణ రాష్ట్ర పోరాటంలో నా వంతు ఉద్యమంలో పాలుపంచుకున్నానని, రాష్ట్ర ఏర్పాటు తర్వాత టిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూపార్టీకి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు విధేయుడిగా ఉంటూ వచ్చాను అని అన్నారు.. కానీ రాజకీయ ఆధిపత్య పోరులో, అణగ త్రొక్కాలని కొందరు సహచరులు నాపై ఎమ్మెల్యేకు లేనిపోనివి చెప్పి, నన్ను ఎమ్మెల్యే ను కలవకుండా చేయడమే కాకుండా, మండల ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్న నన్ను పార్టీ కార్యక్రమాలకు పిలవకుండా మానసిక వేదనకు గురి చేశారన్నారు. నా అవసరం లేని నాకు విలువ ఇవ్వని పార్టీలో కొనసాగ లేక డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో నా మాతృ పార్టీ( కాంగ్రెస్ పార్టీ) లో కలవడం జరిగిందని చెప్పారు. ఇప్పుడు కన్నతల్లి వద్దకు వచ్చిన భావన నాకు కలుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు. తనతోపాటు బెజ్జంకి గ్రామ ఉపసర్పంచ్ బండి వేణు యాదవ్, కుంట హరీష్, మాజీ ఎంపీటీసీ సంగ నరసయ్య, దేవస్థానం మాజీ చైర్మన్ బోనాల మల్లేశం, గొర్ల పెంపకం దారుల సొసైటీ అధ్యక్షులు ఇస్కిల ఐలయ్య, జెల్ల రాములు, సంగ రాజమల్లు, బండి చిన్న ఎల్లయ్య, సంగ స్వామి, సంగ బాల మల్లు పార్టీలో చేరినవారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బెజ్జంకి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, కాంగ్రెస్ బ్లాక్ కమిటీ అధ్యక్షుడు బెజ్జంకి మండలం మాజీ ఎంపీపీ ఒగ్గు దామోదర్ క్రియాశీలక పాత్ర పోషించారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మానకొండూరు నియోజకవర్గం సోషల్ మీడియా ఇన్ఛార్జ్ దొనే వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ యువ నాయకులు శనగొండ శ్రావణ్ కుమార్, శనగండ శరత్, సంగెం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
బెజ్జంకి కాంగ్రెస్ పార్టీలో చేరికలు
- Advertisment -