జనత న్యూస్ బెజ్జంకి : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం బెజ్జంకి మండలం తోటపల్లి వీరాపూర్ బేగంపేట గుండారం గ్రామాలలో మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కరీంనగర్ లోక్ సభ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ను గెలిపించాలని విస్తృత ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా బేగంపేట గ్రామంలో నిర్వహించిన కార్నర్ సభలో మాట్లాడుతూ బండికి రెండు చక్రాలు ఉంటే సరైన దిశలో పయనిస్తుందని జోడి గిరల్లాగా కాంగ్రెస్ ప్రభుత్వం దేశ ప్రజలకు తెలంగాణ ప్రజలకు సేవ చేయాలంటే కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి మన వంతు కానుకగా కరీంనగర్ సీటును తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి కానకగా ఇవ్వాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వంద రోజుల్లోనే తెలంగాణలో ఐదు గ్యారంటీలను అమలుపరిచామని , ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు భవిష్యత్తులో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ చేపడుతుందని ఆలోచించి ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో బిజెపి మోడీ ప్రభుత్వం ఎప్పుడు మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తుందని, తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన గత కెసిఆర్ ప్రభుత్వం దళితులకు ఇస్తానన్న మూడు ఎకరాల భూమి ఇవ్వకుండా పది సంవత్సరాలు పబ్బం గడిపిందని దుయ్యబట్టారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో చేతి గుర్తుపై ఓటు పై వేసి రాజేందర్రావును భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో మహిళలు హాజరై కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నినాదాలు చేశారు. భారీ సంఖ్యలో వివిధ గ్రామాల నుండి కార్యకర్తలు హాజరయ్యారు.
బెజ్జంకి: కాంగ్రెస్ గెలిస్తే కష్టాలన్నీ తీరుతాయి: ఎమ్మెల్యే
- Advertisment -