మానకొండూర్ ప్రతినిధి జనత న్యూస్: హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమాణ స్వీకార మహోత్సవానికి బెజ్జంకి మండల కాంగ్రెస్ శ్రేణులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ కు ఇప్పుడు సార్థకత చేకూరుతుందన్నారు. కాంగ్రెస్స్ ప్రభుత్వ పాలనలోనే సంక్షేమ పథకాలు అందరికీ చేరుతాయని వారు తెలిపారు. హైదరాబాద్ వెళ్లిన వారిలో బెజ్జంకి మండల పార్టీ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డీ మాంకలి ప్రవీణ్ దొనే వెంకటేశ్వర రావు మానాల రవి బాబు చెప్యాల శ్రీనివాస్ కవ్వంపల్లీ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు కత్తి రమేష్ గౌడ్ చిలువెరి శ్రీనివాస్ రెడ్డి బండిపల్లీ రాజు బాబర్ తదితరులు వున్నారు.
ప్రమాణ స్వీకారానికి తరలివెళ్లిన బెజ్జంకి కాంగ్రెస్ నాయకులు
- Advertisment -