బెజ్జంకి, జనత న్యూస్: సిద్దిపేట జిల్లా బెజ్జంకి గ్రామ పంచాయతీ పరిధిలో అనేక సమస్యలను పరిష్కరించాలని, .రోడ్డు నుంచి డ్రైనేజీ వరకు సక్రమంగా లేకపోవడంతో స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారుని ఈ మేరకు గ్రామ సమస్యలు పరిష్కరించాలని బెజ్జంకి కాంగ్రెస్ పార్టీ నాయకుడు తిప్పారపు మల్లేశం వివిధ సమస్యల గురించి వివరిస్తూ మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను వినతి పత్రం ద్వారా కోరారు. ఈ సందర్భంగా ఆయన పలు సమస్యలను వినతి పత్రంలో పొందుపర్చారు. బెజ్జంకిలోని లక్ష్మీనరసింహా స్వామి ఆలయం ఘాట్ రోడ్డును నిర్మించాలని, మాడవీది, గెస్ట్ హౌస్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందు కోసం అవసరమైన నిధులు సమకూర్చాల్సి ఉందన్నారు. బెజ్జంకిలో వంద పడకల ఆసుపత్రి, బాలిక జూనియర్ కళాశాల, కో ఎడ్యుకేషన్ డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేయాలన్నారు. ఎడ్లబండి చౌరస్తా నుంచి రాజీవ్ రహదారి వరకు డబుల్ బీటీ రోడ్డు, శివాజీ చౌరస్తా నుంచి శంకర్ నగర్ వరకు బీటీ రోడ్డు, సత్యసాయి స్కూల్ నుంచి నర్సింహుల పల్లి, రెడ్డి కుంటపల్లి, పోతారం గ్రామాలకు బీటీ రోడ్డు, ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఎస్ సీ కాలనీ మీదుగా బేగంపేట వరకు బైపాస్ రోడ్డు మంజూరు చేయాలని కోరారు. అలాగే వంగ నర్సయ్య ఇంటి నుంచి దుర్గమ్మ ఆలయం వరకు బీట్ రోడ్డు నిర్మించాలన్నారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సుల్లో మూడు సమయంలో బెజ్జంకి నుంచి పోయే విధంగా సౌకర్యం కల్పించాలన్నారు. పాపయ్య పల్లిని నూతన గ్రామ పంచాయతీ గా ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ సమస్యలపై స్పందించి వెంటనే నిధులు మంజూరు చేయాలని కోరారు.
బెజ్జంకి: గ్రామ సమస్యలపై ఎమ్మెల్యే కు కాంగ్రెస్ నాయకుడి వినతి
- Advertisment -