బెజ్జంకి టౌన్, జనతా న్యూస్:కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని రెవెన్యూ కార్యాలయం ముందు ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు నిరసన వ్యక్తం చేశారు. అంతకుముందు మండల కేంద్రంలోని పలు దుకాణా సముదాయాలను బందు చేయించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం తమను మోసం చేసిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికలకు ముందు తమకు కనీస వేతనంగా 18 వేల రూపాయలను ఇస్తామని మాట ఇచ్చారని, కానీ నేటి వరకు అది అమలు కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ సమస్య పట్ల సానుకూలంగా స్పందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు
Bejjanki: అంగన్వాడీ, ఆశ వర్కర్ల నిరసన
- Advertisment -