కరీంనగర్, జనతా న్యూస్ : తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. వాడవాడలా, పల్లెపల్లెలో మహిళలు బతుకమ్మలతో సందడి చేస్తున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం కార్యాలయాలు కూడా పూల లోగిళ్లుగా మారుతున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లాలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కలెక్టర్ గోపి దంపతులు, పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడ, అదనపు కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మి కిరణ్ లు పాల్గొని బతుకమ్మ ఆడారు. మహిళా అధికారులు బతుకమ్మ ఆడుతూ పాటలు పాడారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కరీంనగర్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బతుకమ్మ ఉత్సవాలు
- Advertisment -