Bandi Sanjay :కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ చేపట్టిన మలి విడత ప్రజాహిత యాత్ర టెన్షన్ వాతావరణం నెలకొంది. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర సందర్భంగా పొన్నంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే తాను వ్యక్తిగతంగా ఎవరిపై విమర్శలు చేయలేదని బండి సంజయ్ వివరించారు. అయితే కరీంనగర్ లో ఎంపీగా తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, పొన్నం ఓడిపోతే అందుకు రెడీనా అని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకులు హుస్నాబాద్ లో బండి సంజయ్ ని అడ్డుకునేందుకు రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు భీమదేవర పల్లి మండలం ముల్కనూరులో బండి సంజయ్ పై కొందరు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై బీజేపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Bandi Sanjay : బండి సంజయ్ ప్రజాహిత యాత్ర.. హుస్నాబాద్ లో టెన్షన్. టెన్షన్..
- Advertisment -